కలడు కరుణామూర్తి – Kaladu Karuna Murthy

Telugu
పల్లవి.
కలడు కరుణామూర్తి కన్న తండ్రి,
ఇలన ప్రతి జీవిలో ఈశ్వరుడు శ్రీహరి. ||కలడు||

అనుపల్లవి.
అణువణువున యతడు నెల కొని ఉన్నాడు,
ప్రాణములు కాపాడు పరమాత్ముడు హరి. ||కలడు||

1.
కన్నీరుకాల్వలైకారెడికన్నులలో,
ఉన్నవన్నీ పోయి ఉడుకు జీవముతో,
మున్నీరై బ్రతుకు మగ్గెడి ప్రాణికి,
వెన్నంటి ఉన్నాడు వేంకటరమణుడు. ||కలడు||

2.
కడుపుకింత కూడు కరువైన ప్రాణిలో,
నీడ, గూడు లేని నిర్భాగ్య జీవిలో,
తోడుగ, సఖుడిగ దగ్గరే ఉన్నాడు.
వేడుకొన వరమిచ్చు వేంకటరమణుడు. ||కలడు||

3.
కాలు, కన్నులేకకుందెడిప్రాణిలో,
తొలచెడి బాధతో మూల్గెడి జీవిలో,
చెలిమిగ దరి గలడు కలియుగ దైవము,
వెలలేని దయగల వేంకటరమణుడు. ||కలడు||

రమాకాంతరావు చాకలకొండ

English Meaning
Pallavi.
God, abode of kindness is omnipresent,
He exists in every living thing.

Anupallavi.
He is present in every atom, and
he protects our lives.

1.
In every eye with tears,
In persons who lost everything in life
In lives where there is only sorrow,
Lord Venkataswara is always with them

2.
In persons who are stuck with hunger,
In those who do not have any place to dwell
As a friend and companion
Lord Venkateswara is present always to bless them.

3.
Those who are blind, no limbs
Those suffering with pain,
The God of Present time, Lord Venkateswara
Is present showing friendship and love.

Ramakantha Rao Chakalakonda

1,485 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + four =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>